|
|
by Suryaa Desk | Mon, May 04, 2026, 11:35 AM
ఇండియన్ బ్యాంక్ డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ రుణ సదుపాయం అందిస్తోంది. ‘ఇండ్ MSME సఖి’ పథకం ద్వారా SHG సభ్యులు రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకు లోన్ పొందవచ్చు. కనీసం రెండేళ్లు రుణ చెల్లింపులో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నవారు ఈ స్కీమ్‌కు అర్హులు. వ్యాపారం విస్తరించేందుకు, కొత్త యూనిట్లు ప్రారంభించేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేశారు. 10% మార్జిన్ మనీతో 90% వరకు బ్యాంక్ ఫైనాన్స్ అందిస్తుంది. 60 నెలల రీపేమెంట్ గడువు కూడా ఉంది.