|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:59 PM
వనపర్తి జిల్లా, అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో శుక్రవారం పాలమూరు ఎంపీ డీకే అరుణ బీజేపీ కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మునిసిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అమరచింతలోని 10 వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు అరుణమ్మకు ఘన స్వాగతం పలికారు. పి.రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి బీజేపీ జండా కట్ట వరకు భారీ రోడ్డు షో నిర్వహించారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, రెండేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి రోడ్డు షో నిర్వహించారు. ఈ రెండు పార్టీలను ఓడించి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.