వరంగల్ లో మహిళా స్టాళ్ల నిర్మాణానికి భూమి పుజ, కౌన్సిల్ సమావేశం ప్రారంభం
Wed, May 06, 2026, 12:46 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 07:47 PM
TG: మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. కొడుకు చేతిలో తండ్రి హతమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రేగోడ్ కు చెందిన అల్లమెల్లిగడ్డ షకీర్ మియా(51) కుమారుడు మహమ్మద్ హుస్సేన్ (27) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా మోటార్ సైకిల్ కొనివ్వాలని, భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని హుస్సేన్ బెదిరించేవాడని తెలిపారు. కాగా గురువారం రాత్రి తండ్రిపై కొడుకు దాడి చేశాడన్నారు. షకీర్ మియా తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.