కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు నీటి గుంట, పేరుకున్న బురదతో ఇబ్బంది పడుతున్నామని సోమవారం ఫిర్యాదుదారులు చెబుతున్నారు. ఆర్& బి రోడ్డు నుంచి పోలీస్ స్టేషన్ వరకు మట్టిరోడ్డు వేశారని, అందులో గుంతలు పడ్డాయని అంటున్నారు. గుంతలో వర్షపు నీరు నిలవడంతో దాటి వెళ్లటం ఇబ్బందిగా ఉందంటున్నారు. మట్టి రోడ్డు స్థానంలో సీసీ రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa