ప్రైవేటీచర్ల పైన చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాటికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.ముఖ్యమంత్రి వ్యవహార శైలి, మాట తీరు, చలోక్తులు కొంతమందిని గాయపరుస్తున్నాయన్న సోయి ఆయన మర్చిపోతున్నారు. అది ఆయనకే మంచిది కాదు. ఆయన మాటలు వింటున్న ప్రజలు వీరేనా మా ముఖ్యమంత్రి అని బాధపడుతున్నారు .గవర్నమెంట్ స్కూల్ ల పట్ల, కాలేజీలపట్ల ఎవరికి చిన్న చూపు లేదు. గవర్నమెంట్ స్కూల్లలో, కాలేజీలలో, ప్రొఫెషనల్ కాలేజీలలో పనిచేస్తున్న టీచర్ల పట్ల అపారమైన గౌరవం, విశ్వాసం ఉన్న వాళ్ళం మనం. గతంలో 10వ తరగతి చదివితే టీచర్ ఉద్యోగం, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పీజీ, పీహెచ్డీ చదివిన వ్యక్తులు కూడా ప్రైమరీ స్కూళ్లలో పనిచేసే పరిస్థితి వచ్చింది.ఒకనాడు స్కూల్లు లేవు, ఆశ్రమ పాఠశాలలు ఉండేవి.. వాటికి స్ఫూర్తిగానే ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు వచ్చాయన్న సోయి పాలకులకు లేదు.ఇవాళ విద్య ప్రభుత్వ పరంగా పుట్టలేదు.విద్య.. ఆశ్రమాలు, ఆశ్రమ పాఠశాలల ద్వారా పుట్టింది.మేము ప్రభుత్వ స్కూల్లో చదివిన నాడు గవర్నమెంట్ స్కూల్లో ఒక పిటి మాస్టర్, డ్రాయింగ్ మాస్టర్ ఉండేవాడు. కానీ ఇప్పుడు వారు కనిపించడం లేదు.నేను దేశాయ్ పల్లిలో ఒక హెడ్మాస్టర్ రిటైర్మెంట్ ప్రోగ్రాం కి వెళ్ళాను.. ఆ ఊరంతా బాధపడుతుంది. ఎందుకింత బాధపడుతున్నారని అడిగితే సార్ మీకు ఏం చెప్పాలి? ఈ స్కూల్ కి అటెండర్ లేడు, హెడ్మాస్టరే అటెండర్, హెడ్మాస్టరే అన్ని తానై చేసేవాడు అలాంటివాడు రిటైర్మెంట్ అయితే ఈ స్కూలు ఎవరు నడుపుతారు అని బాధ అవుతుందని చెప్పారు.మనం సిగ్గుపడాల్సింది ఎక్కడంటే గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసే టీచర్లు కూడా ఏమంటున్నారంటే... గవర్నమెంట్ స్కూలను స్కూళ్ల లాగా నడపండి, రేష్నాలైజేషన్ పేరిట అనేక స్కూలు మూతపడటమే కాకుండా, ఒకటే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పే పరిస్థితి వచ్చింది.నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఒకటే చెప్పాను.. విద్య మీద పెట్టే ప్రతి పైసా అది ఎక్స్పెండిచర్ లిస్ట్ లో ఉండొద్దు, అది ఇన్వెస్ట్మెంట్ లాగా భావించాలి అని చెప్పాను.తల్లిదండ్రులు కూడా ఆస్తులు వారసత్వంగా ఇస్తే ఉండదు, జ్ఞానాన్ని వారసత్వంగా ఇవ్వాలని అనుకుంటున్నారు.లక్షలాది మంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్య, నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రావాలని ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో కూడా మంచిగా చదువు చెప్పే టీచర్లు ఉన్నారు కానీ వారికి అన్ని సౌకర్యాలు లేవు. ప్రైవేట్ స్కూళ్లలో అన్ని సౌకర్యాలు ఉండి మంచిగా చదువు చెప్తున్నా టీచర్లను ఇలా ఇన్సల్ట్ చేయడం తప్పు.గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలలో పనిచేసే గెస్ట్ లెక్చరర్స్ కు 8 నెలలు జీతం మాత్రమే వస్తుంది. దీనిపైన నేను అసెంబ్లీలో మాట్లాడాను. అయ్యా ముఖ్యమంత్రి గారు వారి పిల్లల ఫీజులు, ఇంట్లో సామాన్లు, కరెంట్ బిల్లులు ప్రతినెలా వస్తాయి కదా... వారికి 12 నెలల జీతాలు ఇవ్వాలని కోరాను.రేవంత్ రెడ్డి గారు... ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు 12 నెలల జీతాలు ఇప్పించు. కనీసం అడ్డ మీద కూలికి పోతున్న లేబర్ కన్నా మెరుగైన జీతభత్యాలు వచ్చేలా చూడండి.వాళ్లకి కూడా వారి తల్లిదండ్రులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే చూయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు వారికి కూడా హెల్త్ కార్డు ఇవ్వాలినీ డిమాండ్ చేస్తున్నాను.కరోనా సమయంలో స్కూళ్లకు ఫీజులు రాక ప్రైవేట్ టీచర్లకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.. వారు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం సుతారి పనికి, కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకున్నారు, వారి కమిట్మెంట్ పట్ల గర్వపడాల్సింది పోయి ఇలాంటి మాటలు మాట్లాడటం తగదు. ఈరోజు ఈ టీచర్ల ప్రతిపాదనకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa