మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని, భూపతి పేట గ్రామానికి చెందిన. బైరి మమత, భర్త: ఎల్ల స్వామి, 25 సంవత్సరాలు, నాయకపోడు కులానికి చెందిన యువతి, గ్రామ పంచాయితీ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తుంది. తన భర్త తరచు తాగి గొడవ చేస్తున్నాడని, తాను 9 నెలల గర్భవతి కావడంచేత, అదే గ్రామంలో ఉంటున్న తన తల్లి గారి ఇంటి వద్దనే ఉంటుంది.
ఈ మధ్యనే హెల్త్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్ళగా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా లేదు. అని చెప్పడంతో, అప్పటినుండి మనోవేదనకు గురై తల్లికి చెప్తూ బాధపడుతూ ఉండగా, తన తల్లి తనకు ధైర్యం చెబుతూ ఉండేది. ఇదే క్రమంలో నిన్న రాత్రి 9:00 గంటల ప్రాంతంలో, ఇంట్లో నిర్దిస్తున్న మమత. మంగళవారం రోజు తెల్లవారుజామున ఉదయం 3:30 గంటలకు, తన తల్లి లేచి చూసేసరికి కనబడలేదు. బాధితురాలు తల్లి సుంకరి యాకమ్మ భర్త: జంపయ్య. 50 సంవత్సరాలు ఫిర్యాదు మేరకు, గూడూరు పోలీస్ వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa