కొద్దిరోజుల కిందట తెలంగాణలో మందుబాబులకు కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రేవరీస్ చేదువార్త చెప్పిన సంగతి తెలిసిందే. కింగ్ ఫిషర్, హెనికిన్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ స్టాక్ ఇటీవల పడిపోయింది. ఇప్పుడు చేసిన ఒకే ఒక్క ప్రకటనతో మళ్లీ 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. తెలంగాణ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బీర్ సరఫరా పునఃప్రారంభించాలని నిర్ణయించింది యునైటెడ్ బ్రేవరీస్. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa