గాంధీ భవన్ ఆవరణంలో జాతీయ జెండాని ఆవిష్కరించనున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రాజ్యాంగం మార్చాలనే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌ని అవమానించారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని మార్చి.. మనువాద సిద్ధాంతం అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ఇందిరమ్మను అవమానించేలా బండి సంజయ్ మాట్లాడారని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలి ఇందిరా గాంధీ అని అన్నారు.