సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 26వ వార్డు సంజీవయ్య నగర్ ప్రాథమిక పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో మొత్తం 45 మంది విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ రెడ్డిమల్ల భాను, విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.