మంచి ఆరోగ్యానికి పోషకాహారం చాలా ముఖ్యం. కొన్ని సంకేతాలతో మనలో పోషకాహార లోపం ఉందని తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక అలసట, జుట్టు రాలడం, నోటి దుర్వాసన అధికం కావడం, మలబద్ధకం, నోటి పూత, నోరు చివర్లో పుండ్లు రావడం, చర్మ సమస్యలు వంటివి కనిపిస్తాయని పేర్కొంటున్నారు. అలాగే, ఒత్తిడి, మానసిక సమస్యలు అధికమవుతాయంటున్నారు.