గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక సంఘం పరిధిలోని 17 సచివాలయాల పరిధిలో రేపటి నుంచి ఈనెల 22 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ క్యాంప్ కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆధార్ కార్డులో సమస్యలను కేటాయించబడిన కేంద్రాలలో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.