గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో, మేనియా మొదలైంది. గేర్ మార్చిన చిత్రబృందం ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలో, డిసెంబరు 29న భారతదేశంలోనే అతి పెద్దదైన రామ్ చరణ్ కటౌట్ ను ఆవిష్కరించనున్నారు. ఇది ఎక్కడో కాదు... విజయవాడ బృందావన్ కాలనీలో వజ్రా గ్రౌండ్స్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గేమ్ చేంజర్ మేకర్స్ అనౌన్స్ చేశారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం ప్రారంభం నుంచి ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. తమన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. దానికి తోడు టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా తమ చిత్రం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శంకర్ ట్రాక్ రికార్డు చూస్తే...గేమ్ చేంజర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.