శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం గుండెలిగుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే 149వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హెచ్ఎం ముని తిరుమలయ్య మాట్లాడుతూ. ఆడపిల్లల చదువు కోసం కృషి చేసిన మణిపూస సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి, చెంచయ్య, రమాదేవితోపాటూ విద్యార్థులు పాల్గొన్నారు.