విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొంత నష్టం జరగనుందని సమాచారం.
సుమారు 60టన్నుల ఉత్పత్తి నాలుగు రోజుల పాటు నిలిచిపోయే అవకాశం ఉందని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.