దేశ రాజధానిలో అవతరించే విద్యాలయానికి పెట్టాల్సిన పేరు ఇదేనా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యతిరేకించారు. ఈమేరకు ప్రతిష్టాత్మకంగా స్థాపించబోయే ఢిల్లీ కాలేజీకి సావర్కర్ పేరా..? అంటూ ఆయన మండిపడ్డారు.
మతాన్ని ఆధారంగా సమాజాన్ని విభజించే వాదాన్ని ప్రేరేపించి, భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో గాంధీ అహింసాయుత క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన సవార్కర్ పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.