విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ దుమ్మురేపుతున్నారు. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్(137) శతక్కొట్టాడు.
అభిషేక్ (93)తో కలిసి తొలి వికెట్‌కు 196 పరుగులు జోడించాడు. దీంతో పంజాబ్ 50 ఓవర్లలో 426/4 భారీ స్కోరు చేసింది. ఒకే సీజన్‌లో రెండు సార్లు 400 పైచిలుకు స్కోరు చేసిన తొలి జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది.