ఏపీలో జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కానున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఖాయమైన నేపథ్యంలో నేడు రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీతో కిటకిటలాడాయి. ఛార్జీలు పెంచేంత వరకు ఆగకుండా.. ఆస్తుల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది.ఇక, కొత్త చార్జీల అమలు ఎప్పటి నుంచి అనేది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ... రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఖాయమైన నేపథ్యంలో, ఇవాళ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీతో కిటకిటలాడాయి. చార్జీలు పెంచేంత వరకు ఆగకుండా... ఆస్తుల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. సాధారణ దినాలతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కాగా, కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలపై సోమవారం నాడు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.