కర్ణాటక రాష్ట్రం శివమెగ్గ ప్రాంతం నుంచి 101 కర్ణాటక ఆర్టీసీ బస్సులలో దాదాపు 5,000 మంది ఓం శక్తి మాల ధరించిన భక్తులు శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప తమ సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం 101 బస్సులలో దాదాపు 5000 మంది ఓం శక్తి మాల ధరించిన భక్తులకు ఉచితంగా ప్రయాణం, భోజన వసతి కల్పిస్తూ తీర్థయాత్రలకు పంపిస్తున్నారని నిర్వాహకులు, భక్తులు తెలిపారు. శివమొగ్గ నుంచి 25వ తేదీ బయలుదేరిన 101 బస్సులలో దాదాపు 5,000 మంది భక్తులు శుక్రవారం ఉదయం మంత్రాలయంకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటామని, అనంతరం తమిళనాడు రాష్ట్రంలోని ఓం శక్తి ఆలయం అమ్మవారిని దర్శించుకొని ఈనెల 31వ తేదీ శివమొగ్గ తిరిగి చేరుకుంటామని భక్తులు పేర్కొన్నారు.