గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025 ఉత్సవాలను భారత ప్రధాని మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. అభివృద్ధి చెందిన భారత్ 2047 కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడమే ఈ పండుగ థీమ్ అన్నారు.
గ్రామీణ భారతదేశం వ్యవస్థాపక స్ఫూర్తి, సాంస్కృతిక వారసత్వాన్ని పెంచడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. రూరల్ ఇండియా మహోత్సవాలు జనవరి 4 నుంచి జనవరి 9 వరకు జరగనున్నాయి.