రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళిక రచించామని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో మరో జెండా ఎగరలేదు.
కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించాం. వైసీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. కుప్పంకు పెట్టుబడులు తీసుకువస్తాం’’ అని అన్నారు.