ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఅయినంలో రతన్‌టాటా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. విగ్రహం ఆవిష్కరణకు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తీసుకున్న చొరవ అభినందనీయమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు భరోసా ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఉద్ఘాటించారు. తాను గెలవాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఖచ్చితంగా చెప్పిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు అని తెలిపారు. సీఎం చంద్రబాబు రాజకీయంగా గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు అని చెప్పారు. కాని అభివృద్ధి విషయంలో, సమన్వయం విషయంలో ఆయనకు ఎవరూ తక్కువ కాదని స్పష్టం చేశారు. మన మధ్య సమన్వయం దెబ్బతింటే, పార్టీల పరంగా మనకన్నా ప్రజలు ఎక్కువగా నష్టపోతారని అన్నారు. సమన్వయం దెబ్భతింటే మళ్లీ సైకో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.