ఢిల్లీ సీఎం అతిషిపై ఢిల్లీ బిజెపి కల్కాజి అభ్యర్థి రమేష్ బీధూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం అతిషి కంటతడి పెట్టి భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘మా నాన్న జీవితాంతం ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. ఈ దేశ రాజకీయాలు ఇంత దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు’’ అని అన్నారు. కాగా, అతీషి ఇంటిపేరు సింగ్‌గా ప్రస్తావిస్తూ బీదూరి వ్యాఖ్యలుచేశారు.