ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తమ బకాయిలు చెల్లిస్తామని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ చెప్పినట్లు వారు వెల్లడించారు. పరిస్థితులు సరిదిద్ది, బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి రూ.2,250 కోట్ల బకాయిలున్నట్లు తెలిపారు.