విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఏపీ నచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 2017 మెట్రో పాలసీ అధారంగా ఫండింగ్ మోడల్స్‌పై చర్చించారు. రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కి.మీ మేర మెట్రో నిర్మాణంపై చర్చించారు.విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 66 కి.మీ మేర విజయవాడ మెట్రో, 76.90 కి.మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్‌లు ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులపై ప్రదర్శన ఇచ్చారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం ఏపీలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 2017 వరకు వందశాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించే విధానం లేదని... అయితే 2017 పాలసీ ప్రకారం వందశాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కత్తాలో 16 కి.మీ మేర ప్రాజెక్టు చేపట్టారు.