కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పులివెందుల టీడీపీ ఇనచార్జ్ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) అన్నారు. శుక్రవారం సింహాద్రిపురంలో రూ.10 లక్షలతో ముస్లిం శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింహాద్రిపురం మండలంలో వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. పట్టణం లోని ప్రధాన వీధిలో నిలిచిపోయిన సీసీ రోడ్డు, జడ్పీ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. కూటమి ప్ర భుత్వంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశల సారథ్యంలో సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కార్యక్రమంలో తుంగభద్ర ప్రాజెక్ట్ హైలెవెల్ కెనాల్ చైర్మన మారెడ్డి జోగిరెడ్డి, వేంపల్లె టీడీపీ మండల పరిశీలకుడు రఘనాథరెడ్డి, మాజీ జడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పుప్పాల శ్రీధర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, మైనార్టీనాయకులు రఫీ, నబీరసూల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.