సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫి పోటీలకు ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. శుక్రవారం ఆత్రేయపురం లొల్ల లాకుల వద్ద వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం జరిపారు. సంక్రాంతికి ముందుగా నిర్వహించనున్న ట్రోఫి సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో అధికారులు సత్వరమే పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, సమన్వయంతో పనిచేసి సర్ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫి పోటీలు, పడవ, ఈత పోటీలతో పాటు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా ప్రదేశాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, ప్రాజెక్టు కమిటీ వైస్‌చైర్మన్ కరుటూరి నరసింహారావు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు ముళ్ళపూడి భాస్కరరావు, కాయల జగన్నాఽథం, తహశీల్దారు రాజేశ్వరరావు, ఎంపీడీవో వెంకటరామన్ తదితరులు పాల్గొన్నారు.