విజయవాడ దుర్గమ్మను మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉండాలని దుర్గమ్మను ప్రార్థించానని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ఆలయాల ఆధునీకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యాలపై అధికారులను ఆదేశించినట్లు వివరించారు. క్యూలైన్‌లో భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.