గమ్మలక్ష్మిపురంలోని ప్రభుత్వ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమన్నారు.
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈకళాశాలలోనే నేను చదువుకొని ఈస్థాయికి వచ్చానని విద్యార్థులకు గుర్తు చేశారు.