న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025’ని ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఛైర్‌పర్సన్ షాజి కెవి ప్రధాని మోడీని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘మన గ్రామాలు ఎంత సంపన్నంగా మారితే.. అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేయడంలో వాటి పాత్ర అంత గొప్పగా ఉంటుంది’ అని ఆయన అన్నారు.