గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ప్రజల నుంచి బుధవారం అర్జీలు స్వీకరించారు. ప్రజలు తనకిచ్చిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. తాను ప్రజల మనిషినని తన నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం రానికుండా చూసుకునే బాధ్యత తన మీద ఉందని ఎమ్మెల్యే సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎటువంటి సమస్యలున్న తనకు చెప్పాలన్నారు.