ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వదినతో మరిది అక్రమ సంబంధం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2025, 03:08 PM

భర్తకు దూరమైన వదిన వరుసయ్యే మహిళతో మరిది (యువకుడు) అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్లపాటు ఈ తంతు సాగింది. ఈ క్రమంలో ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.దీంతో వివాహం చేసుకోమని మహిళ ఒత్తిడి చేయగా, ఆ యుకుడు అందుకు నిరాకరించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,జనక్ గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 32 యేళ్ల మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మరో ప్రాంతంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆమెకు మరిది వరుసయ్యే ఓ యువకుడు పెళ్లి పేరుతో ఆమెను లొంగదీసుకున్నాడు.ఆ తర్వాత క్రమం తప్పకుండా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో ఆ మహిళ గర్భందాల్చి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయగా అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com