అవనిగడ్డలో మందులను పరిమితికి మించి అమ్ముతున్నట్లు గుర్తించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు భార్గవ మెడికల్ షాపును సీజ్ చేశారు. దీంతోపాటు యజమాని కొనకళ్ల రామ్మోహన్రావును అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ గా పిలిచే ట్రెమడాల్, ఆల్ఫాజోలమ్ టాబ్లెట్లను విక్రయించినందుకు ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గంలో భయాందోళనలు నెలకొన్నాయి.
![]() |
![]() |