తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు ఈనెల 10వ తేదీ నుంచి నీటి సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 11 టీఎంసీల నీరు మాత్రమే ఉందని సోమవారం ఆధికారులు తెలిపారు. ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో నీరు ఆవిరవుతోంది. రైతులు, పంటలు ఎండిపోతున్న సమయంలో మరికొన్ని రోజులు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
![]() |
![]() |