AP: తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు పెడుతున్నారంటూ వాపోయారు. ఇలాంటి వేధింపులు తనకు కొత్తేం కాదన్నారు. ఎన్ని వేధింపులకు గురి చేసి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ నేతలను అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
![]() |
![]() |