కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి చెందిన వివిధ పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రేపు కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), సీపీఎం తదితర విపక్ష పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. బిల్లుపై చర్చలో పాల్గొనాలని, అయితే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన, విభజన ఎజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంటులో విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.
![]() |
![]() |