ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో ఏకంగా 97 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించింది. ఇందులో 14 లక్షల ఖాతాలపై ఫిర్యాదులు రాకముందే వాట్సాప్ చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే ఖాతాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థ ద్వారా గుర్తించి వాటిని తొలగించింది.భారతదేశంలో 50 కోట్లకు పైగా యూజర్లు వాట్సాప్ వాడుతున్నారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఖాతాలు బ్యాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, వాట్సాప్ తన యూజర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, అందుకే కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
![]() |
![]() |