జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కొల్లగుంట గ్రామంలో బుధవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తామని చెప్పడంతో తాము ఈ కార్యక్రమాన్ని చేసామని తెలియజేశారు. ఎన్నికల మునుపు ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడని థామస్ తెలిపారు.
![]() |
![]() |