విశాఖపట్నం: ఇంటి నుండి ట్యూషన్ కు వెళ్లిన బాలిక అదృశ్యమైనట్లు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు నమోదైంది. కంచరపాలెం రైతుబజార్ ప్రాంతానికి చెందిన బాలిక (15) బాలిక నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 26న ట్యూషన్ కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. బాలిక కోసం కుటుంబసభ్యులు చట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు. ఈ మేరకు బాలిక తల్లి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేప్రాంతానికి చెందిన చక్రి అనే యువకుడిపై తమకు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.