వైసీపీ విజయంలో గృహసారథులు కీలకం కావాలని జడ్పీటీసీ మురళీధర్, ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి సూచించారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మతుకువారిపల్లి సచివాలయంలో గురువారం సచివాలయ కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి పీఏ తుకారం, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గోవిందరెడ్డి, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.