ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితిపై స్పందించిన జపాన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 12:23 PM

టోకియో: ఫిబ్రవరి 14 దాడులను జపాన్‌ తీవ్రంగా ఖండించింది. జైషే మహమ్మద్‌పై పాక్‌ కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు జపాన్‌ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి టారో కోనో కోరారు.  కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితిపై స్పందించింది. ఫిబ్రవరి 26న ఉగ్రశిబిరాలపై భారత్‌ దాడి అనంతరం చోటు చేసుకొన్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌-పాక్‌లు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఫిబ్రవరి దాడి అనంతరం ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు మద్దతు లభిస్తోంది. తాజాగా జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాస భద్రతా మండలిలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా బుధవారం ప్రతిపాదించాయి. ఐరాసలో ఈ మూడు దేశాలకు వీటో అధికారం ఉన్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa