ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు వైసీపీ అధినేత జగన్ ను కలుసుకున్నారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి యార్లగడ్డను లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో ఆయన పలు అంశాలపై ముచ్చటించారు. ప్రముఖ రచయిత సి.నారాయణ రెడ్డి(సినారె)పై తాను రాసిన పుస్తకాన్ని జగన్ కు ఆయన అందజేశారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత సి.నారాయణ రెడ్డిపై రాసిన పుస్తకాన్ని జగన్ కు అందించేందుకే తాను వచ్చానని తెలిపారు. ఈ భేటీలో రాజకీయాలపై ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. యార్లగడ్డ ప్రస్తుతం ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa