పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభినందన్‌లా ధైర్యంగా నిలబడాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. పాక్ కుట్రలను బహిర్గతం చేయలన్నారు. సరిహద్దులో భారత జవాన్ల సేవలను ప్రధాని కొనియాడారు. ఐకమత్యంగా పోరాడి పాకిస్తాన్‌పై విజయం సాధిస్తామని పిలుపు ఇచ్చారు. భారత్ నైతికస్థైర్యాన్నిదెబ్బతీయాలని పాక్ ప్రయత్నిస్తోందని మోదీ మండిపడ్డారు. భారత సైన్యానికి అందరూ మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. భారత శక్తిని ఎవరూ ఆపలేరని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa