విశాఖ సాగరతీరం అంతర్జాతీయ క్రీడాకారులతో కలకలా డింది. భారత్‌లో తొలిసారిగా జరిగే ప్రపంచ టూర్ బీచ్ వాలీబాల్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భాగంగా బుధవారం రామకృష్టా బీచ్‌లో లాంఛనంగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు నేటి నుంచి మూడో తేదీ వరకు జరగనున్నాయి. 22 దేశాలకు చెందిన ర్యాంకింగ్ ఆటగాళ్ల జట్లు పోటీపడుతున్నాయి. విశాఖ సాగర తీరమే వేదికగా జరిగిన ప్రారంభోత్సవ పోటీలు క్రీడాభిమానులకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆటగాళ్లు ప్రారంభ వేడుకలో చేసిన కాట్‌వాక్ ప్రత్యేక అకర్షణగా నిలిచింది. ప్రపంచ వాలీబాల్ సమాఖ్య నిబంధనల మేరకు ప్రత్యేకమైన ఇసుకతో కోర్టుల్ని ఏర్పాటు చేశారు. దాంతో విశాఖ క్రీడాభిమానులకు బీచ్ వాల్‌బాల్ ఆడుతున్న క్రీడాకారిణుల ఆట కనువిందు చేయనుంది. గతంలో విశాఖ సాగరతీరంలో నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలు జరిగి నా ఈసారి వివిధ దేశాల క్రీడాకారులు, క్రీడాకారిణులు రావడం ఓ విశేషం. ఈ పోటీలను వీక్షించేందుకు కనీస ధర రూ.5 నుంచి 2వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకోవడానికి కూడా వీలు కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa