ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో మీడియా పాత్ర కీలకం- శ్రీ‌కాకుళం కలెక్టర్ జె. నివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 01:35 AM

 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీడియా పాత్రే కీలకమని శ్రీ‌కాకుళం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ వెల్లడించారు. శనివారం జిల్లాలోని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మరియు కేబుల్ ఆపరేటర్లు, ప్రింటింగ్ ప్రెస్ వారికి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుందని చెప్పారు. మీడియా కూడా నియమ, నిబంధనలు పాటించాలని తెలిపారు. ఓట్లను పొందడం కోసం కుల, మత పరమైన భావాలను అభ్యర్థన చేయకూడదన్నారు. మసీదులు, చర్చిలు మరియు దేవాలయాలు వంటి ఆరాధనా ప్రదేశాలల్లో ఎన్నికల ప్రచారం చేయరాదని తెలిపారు. ప్రింటింగ్ ప్రెస్ లో ఎన్నికల సంబంధించిన పోస్టర్లు, పాంప్లేట్లు ప్రింట్ అవుతాయని, ప్రతీ రోజు ఆ ఖర్చులకు సంబంధించిన అభ్యర్థి పేరు, పార్టీ పేరు వివరాలను సంబంధిత ఎన్నికల అధికారులకు తెలపాలని పేర్కొన్నారు. ప్రింటింగ్ ప్రెస్ లు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని, లేదంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారై ఉంటారని, ప్రచారానికి సంబంధించిన మెటీరియల్ వివరాలు తెలపకపోతే 6 నెలలు వరకు జైలు శిక్ష, 2 వేల రూపాయలు అపరాద రుసుం ఉంటుందని జాయింట్ కలెక్టర్-2 పి. రజనీకాంతారావు వివరించారు. ఎన్నికల్లో అభ్యర్థులు సమావేశాలు ఏర్పాటు చేయడానికి తప్పని సరిగా ఎన్నికల అధికారి అనుమతి ఉండాలన్నారు. విద్యా సంస్థల మైదానాలను పార్టీ ప్రచారానికి వాడకూడదని చెప్పారు. ఎన్నికలకు అభ్యర్థులు ఉపయోగించే వాహనాలకు అనుమతులు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోసం మోటారు వాహనాలను ప్రచారానికి అనుకూలంగా మార్చాలంటే మోటారు వాహనాల ఇన్ స్పెక్టర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్ కు అనుమతి తప్పని సరిగా ఉండాలని, ప్రచారం ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే క్షేత్ర స్థాయిలో సమాచారం అవసరమన్నారు. ఇ.వి.ఎం.లపై ఉన్న అపోహాలను తొలగించేందుకు వివి ప్యాట్ల ను ప్రవేశపెట్టినట్లు లిపారు. ఓటరు ఓటు వేసిన తరువాత ఎవరికి ఓటు వేసింది 7 సెకెన్లపాటు వివి ప్యాట్ లో చూపిస్తుందని, ఓటరు ఎవరికి ఓటు వేసిందీ వెంటనే ఓటరు గమనించాలన్నారు. పోలింగ్ కేంద్రంలోనికి ప్రెసైడింగ్ ఆఫీసర్ మరియు మైక్రో అబ్జర్వర్ లు మాత్రమే సెల్ ఫోన్లు తీసుకువెల్లవచ్చన్నారు. వివి ప్యాట్ లో ఏమైనా లోపం ఉంటే ఓటింగ్ జరగదన్నారు. ఓటర్ల హెల్ప్ లైన్ ఏప్ ఉంటుందని, ఓటర్లకు కావలసిన సమాచారం అందులో ఉంటుందని తెలిపారు. సి-విజిల్ టీంలు శాసన సభ నియోజక వర్గానికి 5 టీంలు చొప్పున ఉంటాయని, ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేయదలచుకుంటే సి-విజిల్ కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఓట్ల తొలగింపుకు ఫారం-7 దరఖాస్తులు వచ్చాయని, వాటిపై విచారణ చేయాల్సి ఉందన్నారు. ఒకే వ్యక్తికి రెండు చోట్లు ఓట్లు ఉన్నా, వ్యక్తి మరణించినా అలాంటి వాటిని ఎన్నికల అధికారుల అనుమతితో తొలగించాల్సి ఉంటుందన్నారు. బి.సి., సి.యు., వి.వి. ప్యాట్ లను ఇ.వి.ఎం. గా గుర్తించాలని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa