- 4 పర్యాయాలు రెండు నియోజకవర్గాలలోను ఎమ్మెల్యేగా విజయఢంకా మ్రోగించాను. అయిదవసారి కూడా విజయఢంకా మ్రోగిస్తాను. అభివృద్ధి ఒకవైపు - అవినీతి మరోవైపు. అభివృద్ధికే ప్రజలు ఓట్లేస్తారు అని ఎపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. శనివారం నాడు రెడ్డిగూడెం మండలంలోని నరుకుళ్ళపాడు, ఓబులాపురంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం, మండల తెలుగుదేశం పార్టీ సమావేశాలలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)లు పాల్గొని ప్రసంగించారు. పంటపొలాలకు గోదావరి నీళ్ళు వస్తున్నాయని, మైలవరం రైతులకు, ప్రజలకు అవినీతి సొమ్ముతో పనిలేదని, ఊర్లకు అడ్డంగా జండాలు, బ్యానర్లు కట్టొద్దని, పార్టీల కోసం, జండా రంగుల కోసం గొడవలు పడొద్దని హితవు పలికారు. రెండు నెలలు పోతే అవినీతిపరులు బుల్లెట్టుకు కూడా దొరకరు అని మంత్రి ఉమా ఎద్దేవా చేసారు. 18 ఏళ్ళ పాపట్ల మేరి అనే బాలిక జూబ్లిహిల్స్‌లో చనిపోయిందని, ఆ విషయంపై నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళిందని చెప్పారు. పొదిలి రవిని బినామీ ఆస్థి వాటాల గొడవలో చంపేసినట్లు తెలిపారు. మైలవరం ప్రజల ముందుకు వచ్చిన వైకాపా అభ్యర్ధి సిబిఐ, ఈడి కేసుల్లో గవర్నమెంట్ స్థలాలనే కొట్టేసిన ఘనుడని ఎద్దేవా చేసారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 3, 4 పర్యాయాలు లబ్ధిపొందిన లబ్ధిదారులు తెలుగుదేశానికే ఓటు వేస్తారనే పూర్తి విశ్వాసంతో వైకాపా నాయకులు వారి పేర్లను తొలగించేందుకు ఫారం 7తో కుట్రపూరితంగా ఫిర్యాదు చేస్తున్నట్లు ఆరోపించారు. మంత్రి ఫరూక్ పేరునే తీసేసారని చెప్పారు. 24 లక్షల ఓటర్లు తెలంగాణలో తమ ఓట్లు తొలగించారని కళ్ళంట నీరు పెడితే బ్రిటీష్ వాడు చెప్పినట్లు ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారులు ప్రజలకు సారీ చెప్పి సరిపుచ్చినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో డబ్బుకు, అవినీతికి చోటు లేదని, అభిమానంతోనే ప్రజలు ఓటేస్తారని మంత్రి ఉమా స్పష్టం చేసారు. మంత్రి ఉమా, ఎంపీ నాని రాక సందర్భంగా నరుకుళ్ళపాడు, ఓబులాపురం ప్రజలు బ్రహ్మరధం పట్టారు. దారి పొడుగునా స్వాగత బ్యానర్లు కట్టి, బంతిపూలతో అడుగడుగునా ఘనస్వాగతం పలికారు._
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa