ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రెస్‌మీట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 12:34 PM

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అన్ని రాష్ర్టాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు ఎలక్షన్ కమిషన్‌కు నివేదికను అందజేశాయి. శనివారం సాయంత్రం సమీక్ష చేసిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో షెడ్యూల్ ప్రకటించేందుకు నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. లోక్‌సభతో పాటు 4 రాష్ర్టాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్, మే నెలల్లో 7 లేదా 8 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3తో ముగియనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa