ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనూహ్యంగా తెర‌మీద‌కు గండి జ్యోతి - పెందుర్తిలో అదీప్ రాజ్ ఔట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 12:00 PM

ఓ వైపు తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌డంతో విశాఖజిల్లాలోని రాజకీయ సమీకరణాలు మారేలా వైఎస్సార్సీపీ వ‌ర్గాలు అడుగులువేస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేలా చేయాలనే లక్ష్యంతో అన్నివర్గాలు కలిసికట్టుగా పనిచేయాల‌ని నిర్ణ‌యించుకున్న నేత‌లు ఒక్క‌ట‌వుతున్నామ‌ని చెపుతునే సామాజిక వర్గాల నుంచి పావులు కదుపుతున్నారు.  అయితే ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఎవరికీ టిక్కెట్లు ఖరారు కావకపోవడంతో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆశావాహులు కొంత ఇబ్బంది ప‌డుతున్నారు. అధిష్టానం దృష్టిలో ప‌డేందుకు బాలబాలను ప్రదర్శించే పనిలో పడ్డారు.  


ఈ దఫా ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆర్ధికంగా, సామాజిక పరంగా, రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు తమ టిక్కెట్టు ప్రయత్నాలను అధిష్టానం వద్దే ప్రదర్శిస్తున్నారు. పెందుర్తి శాస‌న‌స‌భా స్థానంపై దృష్టి కేంద్రీక‌రించి అనేక మంది త‌మ ప్ర‌య‌త్నాలు ఆరంభించారు.  ఈ నియోజకవర్గం సీటు గతంలో అదీప్ రాజ్ కి ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే గత రెండు దఫాలుగా పార్టీలో ఉంటూ చాలా వరకూ ఆర్ధికంగా వెనుకబడ్డారనే ప్రచారం జ‌రుగుతుండ‌టంతో  అనూహ్యంగా విశాఖజిల్లా పార్లమెంటు జనరల్ సెక్రటరీగా వున్న గండి జ్యోతి పేరు పెందుర్తి ఎమ్మెల్యే టిక్కెట్టు కి పరిశీలను వెళ్లింద‌ని స‌మాచారం.  ఈమె సామాజిక వర్గానికి చెందిన ఎందరో రాష్ట్రస్థాయి నాయకులు, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఈమె అభ్యర్ధిత్వంపై సానుకూలంగా ఉండటంతో పాటు టిక్కెట్టు వస్తే, ప్రత్యర్ధి పార్టీలో ఉన్నా వైఎస్సార్సీపీకి వలసలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.   ప్రత్యర్ధుల కంటే సామాజికపరంగా, కుటుంబ పరంగా చాలా బలమైన నాయకత్వం వెనక వుండటం కూడా గండిజ్యోతి పేరు పనిశీలనకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఇటు గండి జ్యోతి కూడా వైఎస్సార్సీపీ పార్టీలోని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లోప్రజల తరపున గళం గట్టిగా వినిపించారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ నియోజవకర్గంలో మంచిపేరు తెచ్చుకుంటున్నారు. ఇటు స్థానిక ప్రజలు, పంచాయితీల్లో కీలకంగా వున్న ముఖ్య పార్టీ నేతలతో ఉన్న సత్సంబంధాలు కూడా ఈమెకి బాగా కలిసి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  గెలుపు గుర్రాల దిశగా పయనిస్తుందా…లేదంటే మాటకు కట్టుబడి అనుకున్నవారికి ఇస్తారా అనేది అధిష్టానం ముందున్న అంశం…ఏం జరుగుతుందో వేచి చూడాలి…






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa