కడప : అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందకు మరికొద్దిసేపటిలో పోస్టుమార్టం జరుగనున్నది. వివేకానంద గుండెపోటుతో మరణించారు. అయితే మృతదేహం పడి ఉన్న చోట రక్తపు మరకలు ఉండటం, ఆయన తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో వివేకా పిఎ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో పోలీసులు ఐపిసి సెక్షన్ 175 కింద కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa