గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీలు ప్రవేశపెట్టిన 5 కేజీల సిలిండర్లు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఎలాంటి గుర్తింపు పత్రం లేకుండానే నేరుగా కొనుగోలు చేసే సౌకర్యం ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ కంపెనీలు ఈ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చాయి. వలస కార్మికులు, విద్యార్థులు, అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ సిలిండర్ల కోసం రూ.1000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, సిలిండర్ ధర సుమారు రూ.500 ఉంటుంది. దేశంలో ఎక్కడైనా రీఫిల్ చేసుకునే సౌకర్యం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa