ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోంద్‌ కతీరా ప్రయోజనాలు..

Life style |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2026, 02:34 PM

ఈ వేసవి కాలంలో సెగలు పుట్టించే వేసవి తాపానికి బాదమ్‌ గోంద్‌ కతీరా ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పొచ్చు. చూడటానికి స్పటిక ముక్కల్లా ఉండే ఈ సహజసిద్ధమైన జిగురు నీటిలో కొద్దిసేపు నానగానే మంచు ముక్కల్లాంటి జెల్లీగా మారి ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి కేవలం చలువ చేయడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని ఇవ్వడానికి తోడ్పపడుతుంది. ఇదే విషయాన్ని RJPPD అధ్యయనం సైతం పేర్కొంది. మన పూర్వీకుల నుంచి ఎండాకాలం వడదెబ్బ తగలకుండా వాడుతున్న మనం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక చెట్టు నుంచి వచ్చే సహజసిద్ధమైన జిగురు. ఇది గట్టిగా ఒక రాయిలా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏమిటంటే దీనిని నీటిలో నానబెట్టగానే అది జెల్లీ లాగా ఉబ్బుతుంది. దీనికి ఎలాంటి రుచి ఉండదు. కాబట్టి దీనిని ఏ డ్రింక్‌లో అయినా సులభంగా కలుపుకోవచ్చు.


 


ఇది నేచురల్‌ కూలెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గిస్తుంది మరియు వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇక మూత్రంలో మంట, శరీరంలో వేడి వల్ల కలిగే ఇతర సమస్యలను అదుపు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. మొటిమలు తగ్గడానికి, చర్మం కాంతివంతంగా మారడానికి తోడ్పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa